Header Banner

Begumpet Airport: బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు! డాగ్ స్క్వాడ్‌లతో విస్తృత తనిఖీలు!

  Wed Jun 18, 2025 13:32        Others

హైదరాబాద్ నగరంలోని బేగంపేట విమానాశ్రయంలో బుధవారం ఉదయం కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విమానాశ్రయంలో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఈమెయిల్ ద్వారా వచ్చిన సందేశం కలకలం రేపింది. ఈ సమాచారం అందుకున్న వెంటనే నగర పోలీసులు, విమానాశ్రయ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.

బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు హుటాహుటిన విమానాశ్రయానికి చేరుకున్నాయి. ఎయిర్‌పోర్ట్ ప్రాంగణమంతా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.


ఇది కూడా చదవండి: మంగళగిరి మీదుగా మరో రైల్వే లైన్! రూ.2,000 కోట్లతో.. రూట్ మ్యాప్ ఇదే!


ప్రతి మూలను గాలించినప్పటికీ ఎటువంటి పేలుడు పదార్థాలు గానీ, అనుమానాస్పద వస్తువులు గానీ లభ్యం కాలేదు.

గంటల తరబడి విస్తృతంగా సోదాలు చేసిన అనంతరం విమానాశ్రయంలో ఎలాంటి బాంబు లేదని అధికారులు నిర్ధారించారు. దీంతో అటు పోలీసులు, ఇటు విమానాశ్రయ సిబ్బందితో పాటు ప్రయాణికులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఎవరో ఆకతాయి కావాలనే ఈ బెదిరింపు ఈమెయిల్ పంపి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈమెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఘటనతో విమానాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదని సమాచారం.

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు శుభవార్త! ఆసియాలోనే తొలిసారిగా మన విశాఖలోనే.. భారీ ప్రాజెక్టు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

YS Jagan: వైసీపీలో హై టెన్షన్! జగన్ పల్నాడు పర్యటన వేళ..

 

Economy Park: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! చంద్రబాబు మరో కీలక నిర్ణయం! రూ.1500 కోట్లతో.. 400 ఎకరాల్లో..

 

ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్‌లోనే..

 

Changes in Caste Name: ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ కులం పేరు మార్పు!

 

Lookout Notices: వైసీపీ నేతకు ఝలక్! లుక్ అవుట్ నోటీసులు జారీ! పోలీసుల కస్టడీలో..

 

Gold rates: పసిడి ప్రియులకు శుభవార్త... భారీగా తగ్గిన బంగారం ధరలు!

 

Andhra Economy: చంద్రబాబు సమీక్షలో దిశానిర్దేశం! 15% వృద్ధి లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ!

 

Free bus: ఆడవాళ్ళకి అదిరిపోయే శుభవార్త... ఆగస్టు 15 నుంచి అమలు!

 

 Annadaata sukibhava: రైతులకు బిగ్ రిలీఫ్! వారికి ఈ కేవైసీ అక్కర్లేదు.. స్టేటస్ చెక్ చేసుకోండి!

 

రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు! ఇక నుంచి ఇలా!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!

 

Praja Vedika: నేడు (18/6) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #BegumpetAirport #BombThreat #AirportAlert #HyderabadNews #SecurityCheck #DogSquad #AirportSecurity #BombScare #TelanganaNews